Categories
బిడ్డను కనాలని నిర్ణయించుకొనే ముందర ముందు పోషకాహారం, అలాగే వ్యాయామంపై ద్రుషి పెట్టాలని లండన్ క్వీన్ మేరీ యూనివర్సిటీ పరిశోధకులు చెప్తున్నారు. సరైన ఆహరం తీసుకొని తగినంత వ్యాయామం చేస్తే శరీరానికి చక్కని ఫిట్ లో ఉండే ఆ ప్రభావం బిడ్డపై ఉంటుందని వారు చెప్తున్నారు. బిడ్డను కనే వయసులో ఉన్న మహిళలల్లో సగం మంది ఊబకాయంతో ఉన్నారని, వారు కనుక ఎరోబిక్స్, సైక్లింగ్ గనుక చేసి ఉంటె గర్బవతి అయ్యాక పెరిగే బరువులో 700 గ్రాముల తగ్గుదల ఉంటుందని చెప్పారు. దీనివల్ల సిజేరియన్ అవసరం 10 శాతం వరకు తగ్గుతుందని పరిశోధన ఫలితాలు చెప్తున్నాయి. ముందే శరీరం సరైన ఆరోగ్యంతో ఉండ స్త్రీలు గర్బిణీగా ఉన్న ఎక్కువ బరువు పెరగరని అలాంటప్పుడే ఆపరేషన్ల అవసరం ఉండదని నిపుణుల అభిప్రాయం.