Categories
సుస్మితా బాగ్చీని మైండ్‌ట్రీకి కో ఫౌండర్ సుబ్రొతో బాగ్చీలు సతీమణి యు ఎస్ లో కొన్నాళ్లు ఉద్యోగం చేసిన ఈ దంపతులు, తాము సంపాదించిన డబ్బులు ఎక్కువ శాతం విద్య, వైద్యం ఖర్చు చేయాలని ముందే నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది 179 కోట్ల విరాళం తో హరూన్ ఇండియా జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచారు. కటక్ లో పుట్టి పెరిగిన సుస్మిత పొలిటికల్ సైన్స్ లో పి జి చేశారు.1990 లో ఆమె రాసిన కథకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఆటిజం పిల్లల కోసం రాసిన పుస్తకాన్ని పెంగ్విన్ బ్రిటన్ చిల్డ్రన్ ఆఫ్ ఏ బెటర్ గాడ్ గా ఆంగ్లంలోకి అనువాదం అయింది. దీన్ని భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ హిందీలో ప్రచురించింది. ఆమె ఎనిమిది కదా సంకలనాలు 10 నవలలు ఒక ట్రావెలాగ్ రాశారు.