ఆస్తి దస్తావేజులు లాగా ఒక్కో తరం లో ఉన్న విలువైన రుచుల దస్తావేజులు కూడా ఇంకో తరానికి అందించాలి అంటుంది సుధా మీనన్ తన తల్లి చిన్నప్పుడు తిన్న వంటలతో మొదలుపెట్టి దేశంలోని ఎందరో సెలబ్రిటీలు బాల్యంలో ఇష్టపడి తిన్న వంటల గురించి తెలుసుకుని విలువైన దస్తావేజు పుస్తకం రాసింది సుధా మీనన్. ఆమె రాసిన ‘రెసిపీస్ ఫర్ లైఫ్’ లో మేరీ కోమ్, సుహాసిని, ఆమిర్ ఖాన్, విద్యా బాలన్, ఇర్ఫాన్ పఠాన్ మొదలైన సెలబ్రెటీలు ఇష్ట పడే ఆహార వివరాలున్నాయి. దేశంలోని నైసర్గిక ప్రాంతాలు కవర్ అయ్యేలా వేరు వేరు చోట్లకు చెందిన సెలబ్రిటీలను ఎంచుకోవడం వల్ల ఈ పుస్తకంలో విభిన్నమైన రుచులు చోటుచేసుకున్నాయి. భారతదేశంలో ఎన్నో తరాలుగా వంటలను తీర్చిదిద్దుతూ వస్తున్నారు. అవన్నీ రికార్డ్ చేయకపోతే మాయం అవుతాయి అంటోంది సుధా మీనన్.
Categories