భారతీయ వంటకాల్లో తాలింపు,మసాలా,మేకింగ్ మీడియంలో ఆవ గింజలుంటాయి కాస్త చేదుగా ఘాటైన వాసనతో వుండే ఆవపిండి లేకుండా ఊరగాయలే వుండవు . భారతీయ ఉపఖండంలో నలబై రకాల ఆవాలున్నాయి. ఘాటు తక్కువగా వుండే పసుపు రంగు ఆవాలు మధ్యధరా ప్రాంతం లో పండుతాయి తెలుపు నుంచి పసుపు రంగులో వుండే ఆవాలు ఈ ఆవాల్ని హాట్ డగ్స్ సాండ్ విచ్ లు హోమ్ బర్గర్ల లో ఎకువుగా వాడతారు . ఈ గింజల్లో కెరోటిన్,ప్రోటాన్,ఐరన్,కాల్షియం ఎక్కువగా వుండటంతో వాటి నుంచి తీసిన నూనెతో మర్దన చేస్తే జుట్టు వత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ నూనెతో మర్దన చేస్తే వళ్ళు నొప్పులు తగ్గిపోతాయి. వాటిలోని పోషకాలు బిపి,మోనోపాజ్ ,ఆస్తమా,సమస్యలు తగ్గటానికి ,ఫంగల్,బాక్టీరియా, వ్యాధుల్ని తగ్గించటానికి ఉపయోగ పడతాయి .

Leave a comment