విద్యావేత్తగా స్థిరపడిన మెర్సీ రెగో 1977 లో ముంబైలో చదువుకున్నారు. పదవ తరగతి లో ఆమెకు ఎంతో మంది స్నేహితులున్నారు. 60 ఏళ్లు దాటాక ఈ స్నేహితులను కలుసుకోవాలనుకున్నారు మెర్సీ క్లాస్ అఫ్ 1977 పేరుతో ఫేస్బుక్ పేజీ ఏర్పాటు చేసి స్నేహితులను కలుసుకున్నారామె. 2022 బెంగళూరులో తొలిసారి గర్ల్స్ ట్రిప్ పేరుతో బెంగళూరులో కలుసుకున్నారు స్నేహితులు. తర్వాత అంతర్జాతీయ ప్రయాణం పెట్టుకుని కోలాలంపూర్ వెళ్లి వచ్చారు. వయసు మళ్ళిన ఈ స్నేహ బృందం చేసిన విహారయాత్ర ఎందరికో స్ఫూర్తి.

Leave a comment