కైలాసంలో శివుడు తపస్సు చేస్తున్న సమయంలో ఆనందంతో పార్వతి దేవి పరుగున వచ్చి శివుని కన్నులు మూసిన వెంటనే ముల్లోకాల్లు అంధకారంలో మునిగిపోయిన దేవతల మొర ఆలకించి తన ఫాల నేత్రంలో జనులను రక్షిస్తాడు.
పార్వతీ దేవి తన తప్పుకి ప్రాయశ్చిత్తంగా దక్షిణ ముఖాభియై కాశీరాజు రాజ్యంలో తపస్సుకి నాంది పలికింది.అప్పటికే ఈ ప్రాంతంలో వర్షాలు,పంటలు లేక కరువు తాండవిస్తోంది.ధాన్యాగారం అడుగుకి వచ్చింది. రాజు దిగులు పడుతున్న సమయం లో ఈ స్త్రీ మూర్తి గురించి విని మారు వేషంలో సైన్యంతో బయలుదేరాడు రాజు.అన్నప్రసాదం పెట్టిన స్త్రీ మూర్తికి చేతులెత్తి దండం పెట్టి ఆమెను అక్కడే వుండమని కోరాడు.కానీ దేవి సమయపాలనకు ప్రాధాన్యత ఇచ్చి బయలుదేరుతూ అంతా మంచే జరుగును అని దీవించిన అక్కడ సుభిక్షంగా వర్షాలు పడి పంటలు చేతికి వచ్చాయి.
అప్పుడు శివుడు ప్రత్యక్షమై పార్వతి దీక్షను మెచ్చి వరమడగమనిన మరల ఇలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి తన శరీరంలోని సగభాగంగా అనుమతించమని కోరిన అర్థనారీశ్వర రూపంలో దర్శనం చేసుకోవాలి.
నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు
-తోలేటి వెంకట శిరీష గారు