Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2019/12/onam-sadya-dishes-1_0_1.jpg)
ఎప్పటి నుంచో అరిటాకులో భోజనాలు చేయటం సంప్రదాయం . నెమ్మదిగా అరిటాకుల స్థానంలో కుత్రిమ విస్తరాకులు వచ్చేశాయి . కానీ అరిటాకులో భోజనం చేయటం చాలా ఆరోగ్యం అంటున్నారు అధ్యయనాలు . గ్రీన్ టీ లో ఉండే ఎపిగాలో కెటిబిన్ గాలెట్ అనే పాలీ పెనాల్ అరిటి ఆకులో లభిస్తుంది . ఈ పచ్చని ఆకుల్లో వేడివేడి పదార్దాలు అన్నం వడ్డించుకొని తినటం వల్ల వాటిలోని ఫాలీ ఫెనాల్ ఆహారం ద్వారా శరీరంలోకి చేరుతుంది . ఇది అనేక రుగ్మతల నుంచి పరిరక్షించ గలదనీ అరటి ఆకుల్లోని యాన్తి బాక్టీరియల్ గుణాలు ఆహారంలోని సూక్ష్మ జీవులను నశింపజేస్తాయని నిపుణులు పేర్కొన్నారు .