నేలపైన పువ్వుల కార్పెట్స్ పరచినట్లు  అనిపిస్తాయి టులిప్ పువ్వులు. పొడిగాటి  లిల్లి లాంటి సౌందర్యం. సగం విచ్చుకున్న  మొగ్గలాంటి సుకుమారం. ఈ హైబ్రిడ్ పువ్వుల పేరుతొ వస్తున్నా టులిప్ సల్వార్ కమీజ్ లు కూడా అంతే బావుంటాయి. ఖాదీ వస్త్రాలయినా  స్టయిలిష్  పాకిస్థానీ సల్వార్ కమీజైనా  ఈ టులిప్ సల్వార్ లు మాత్రం పువ్వుల్ని మించిన నాదంగా వున్నాయి. ఈ టులిప్ సల్వార్ లు బ్యాగీ పటియాలా  స్టయిల్ అనిపిస్తోంది. కానీ ఇవి ప్రత్యేకం నడుము దగ్గర వదులుగా వెడల్పుగా కనిపించే ఫ్యాబ్రిక్ కాళీ మడమ వరకే ఉంటుంది. ఈ సల్వార్ ల పైకి కుర్తీ ,కుర్తా, లాంగ్ కమీజ్ లు వేసుకోవచ్చు. మంచి మ్యాచింగ్ కమీజ్ వేసుకుంటే మటుకు ఆ ఫంక్షన్లు ఎలాంటిదైనా ఈ కాంబినేషన్ దానికి ప్రత్యేక కళ తీసుకువస్తుంది. ముందుగా ఆన్ లైన్లో ఈ ఫ్యాషన్ టులిప్ సల్వార్ లు చూసేయండి.

Leave a comment