ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. కండరాలు నరాల వ్యవస్థ పని తీరు బావుండాలన్నా శరీరానికి కాల్షియం కావాలి. సాధారణంగా కాల్షియం టాబ్లెట్స్ వాడుతుంటారు. కానీ డైట్ తో పాటు ఆరెంజ్ ,సొయా మిల్క్ లాంటివి చేర్చుకుంటే ఈ టాబ్లెట్స్ అవసరం రాదు. కప్పు పాలల్లో 280 మి. గ్రా కాల్షియం ఉంటుంది. ఒక్క ఆరెంజ్ లోకాల్షియం తో పాటు విటమిన్ డి కూడా లభిస్తుంది. సొయా పాలలో కూడా కాల్షియం విటమిన్ డి ఉంటాయి. కప్పు బాదం పాలు 457 మి. గ్రా కాల్షియం దొరుకుతుంది. అలాగే ప్రోటీన్స్ కూడా. అలాగే పెరుగులో ఎంతో కాల్షియం ఉంటుంది. పాలకు బదులు పెరుగు తీసుకున్నా కాల్షియం నిల్వల్లో ఇది టాప్ లిస్ట్ లోనే ఉంటుంది. జున్ను లో కూడా కాల్షియం ప్రోటీన్ నిల్వలుంటాయి. ఇక ఆకు కూరల్లో పాల కూర , తోట కూర ,బ్రొకోలీ వంటివి తిని తీరాలి. ఇవన్నీ అనుదినం తీసుకునే ఆహారంలో ఉంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
Categories