70ల్లో, 80 ల్లో వున్న చాలా మంది పెద్ద వాళ్ళు ఇప్పుడో వాళ్ళ చినప్పటి సంగతుల్ని తేదీలు, సంవత్సరాల వారీగా చెప్పేస్తూ వుంటారు, పైగా జ్ఞాపక శక్తి, తెలివితేటలూ, ఓపిక కుడా తగ్గకుండా యవ్వనోత్సాహం తో వుంటారు. దీనికి కారణం వాళ్ళ మనస్సుకు నచ్చిన స్నేహితులు ఉండటమే నని పరిశోధకులు చెప్పుతున్నారు. మంచి మంచి స్నేహితులు దగ్గరలో వుండి, ప్రతి నిత్యం వాళ్ళతో మాట్లాడుతూ అనుభవాలు షేర్ చేసుకుంటూ వుంటే వయస్సు మీద పడిపోతున్న జ్ఞాపక శక్త, ఓపిక తగ్గడం అంటూ కనబడలేదని అద్యాయినకారులు పేర్కొన్నారు. సామాజిక అనుబంధాలు, స్నేహితులతో బాంధవ్యాలు లేకపోతేనే మతి మరుపులు, అనారోగ్యాలు అధికంగా ఉంటాయిట. చక్కని స్నేహ సంబందాలుంటే అన్ని విధాలా ఆరోగ్యంగా వున్నారని కొన్ని లక్షల మంది తో చేసిన పరిశోధనా ఫలితాలు చెప్పుతున్నాయి.
Categories