చలి పెరిగిపోతుంది. ఎండలతో పోల్చితే సుఖంగా ఉంటుంది కానీ దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య  సమస్య మాత్రం ఇబ్బంది పెడుతుంది. ఇందుకు గానూ వంటింటి చిట్కాలు అనుసరించ మంటున్నారు పెద్దవాళ్ళు. రోజు ఒక గ్లాసు పాలలో చిటికెడు పసుపు వేసి మరిగించి తాగుతూ వుంటే జలుబు జ్వరం వంటివి పక్కకు కుడా కావంటున్నారు. అలాగే దాల్చిన చెక్క శారీరక జీవక్రియను మెరుగు పరుస్తుంది. కాఫీ, గ్రీన్ టీ ల లో కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగితే ఈ సీజన్ లో వచ్చే అనారోగ్యాలు రావు. అలాగే పాలలో మిరియాల పొడ, బెల్లం కలుపుకు తాగినా రుచీ, ఆరోగ్యం కుడా. అలాగే తేనె వాడకం పెంచితే మేలు. అల్లం తేనె కలిపినా టీ తాగితే గొంతు సమస్యలు రావు. అలాగే మంచి పోషకాల తో కూడిన ఆహారం తీసుకుంటే మంచిది.

Leave a comment