Categories
WhatsApp

ఆరోగ్యానికి ఫిట్నెస్ కీలకం.

ఆరోగ్యంగా వుండటం అన్నది ఒక దీర్ఘకాల ప్రయాణం. ఎవ్వరికి వాళ్ళు అలవరచుకోవలసిన ఒక మంచి అలవాటు వంటిది. ఎంత పద్దతిగా తినొద్దూ అనుకున్నా పండగలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు రూల్స్ ని బ్రేక్ చేయమంటాయి. తప్పులేదు మరీ అవసరం అయితే హాయిగా భోజనం చేయొచ్చు.కానీ వెంటనే శరీర చురుకుదనంతో అదనపు కాలరీలు కరిగించాలి. ఎన్ని కాలరీలు ఎక్కువగా పొతే వాటిని కరిగించే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం కోసం కొన్ని పద్దతులు పాటించ వచ్చు. ఉదయాన్నే ఓ గ్లాసు కురగాయల రసం తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి క్యారెట్ ఉసిరి ఇతర కురగాలు కలిపి రసం తాగాలి. వీటిలోని యాంటీ అక్సిడెంట్స్, ఎంజైమ్స్ విషతుల్యాలను బయటకు నెట్టేస్తాయి. బీటా కెరోటిన్ సి,ఇ విటమిన్లు, పండ్లు, కూరగాయలు, నట్స్, గింజలు తినాలి. ఆరోగ్యానికి ఫిట్నెస్ కీలకం. సరైన ఆహారం జీవన శైలిలో మార్పులు అవసరం. శరీరక బరువు కంటే ఆరోగ్యం చాలా ముఖ్యం. సరైన బరువులో ఉండేలా చూసుకోవాలి.

Leave a comment