Categories
పళ్ళు,గోళ్ళు నాలుక అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటాయి.గోళ్ళలో మార్పులు జాగ్రత్తగా గమనిస్తే గోళ్ళలో తేడా గమనించవచ్చు.పాలిపోయిన గోళ్ళు రక్తలేమి కాలేయ సమస్యలు సూచిస్తాయి.పోషక పదార్ధాల లోపం,గుండె సమస్యలున్నట్లు అనుకోవచ్చు. తెల్లని గోళ్ళు కామెర్లకు సూచన. పచ్చని గోళ్ళు ఫంగస్ చేరినట్లు చెబుతాయినీలం గోళ్ళు శరీరానికి ఆక్సిజన్ అందడంలేదని చెబుతాయి.థైరాయిడ్ జబ్బు ఉంటే గోళ్ళు ఎండినట్లు కనిపిస్తాయి. గోళ్ళ పై భాగం గతుకులు పల్లాలుగా ఉంటే అది కీళ్ళ జబ్బు సూచిస్తుంది.