Categories
గంటల కొద్ది విశ్రాంతి లేని పనివేళలోనీరసం తెప్పిస్తూ ఉంటాయి. ఆకలిగా ఉన్నా ఎక్కువ తినలేకపోవడం కూడా జరుగుతుంటుంది. భోజనానికి కాస్త సమయం కేటాయించకుండా అశ్రద్ద కూడా దీనికి ఒక కారణం. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోమంటున్నారు.ఉదయం లేవగానే నానబెట్టిన బాదం గింజలు ఒక అరటి పండు తినడం వల్ల కూడా శక్తి సమకూరుతుంది. ఎన్ని పనులున్నా కనీసం బ్రేక్ ఫాస్ట్ బ్రేక్ చేయకుండా ఉండాలి,బ్రేక్ పాస్ట్ లో తప్పనిసరిగా గుడ్డు ఉండాలి. ఈ ఎండలకు మజ్జిగ తప్పనిసరిగా తాగాలి. ఈ సీజన్ లో వచ్చే ప్రతిపండుని తినాలి.మంచి నీళ్ళు తాగాలి.