పాత  కాలపు ఇళ్ళలో తప్పని సరిగా పూజా మందిరం, దేవుడికోగది వుండేది. ఉదయాన్నే ఇంటి పెద్ద స్నానం చేసి దేవుడికి అగరువత్తులు వెలిగించి కర్పూరం తో హారతులు ఇచ్చి పూజ చేసే వాళ్ళు. ఆ వాసనలు ఇల్లంతా పరుచుకుని ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇంట్లో కనిపించేది. మరి ఆ సువాసనలు రావాలంటే ఇంట్లో హల్లో చామంతులు, గులాబీలు వంటి పువ్వులను నేల్లల్లో వేసి ఉంచితే ఇంటికి అందం సువాసన కుడా. సువాసనలు మనకి హాయినిస్తాయి. ఎంతో ఖరీదైన పరిమళ ద్రవ్యాలు కొనక్కరలేదు. ఒక గిన్నెలో నీళ్ళు వేసి రెండు నిమ్మ చుక్కలు వేసి మరగానిస్తే ఆ వాసనకు ఇంట్లో దుర్వాసనలు ఏమున్నా పోతాయి. అలాగే దాల్చిన చెక్క పొడిని నిప్పిల పైన వేసినా మంచి వాసన వస్తుంది. గ్యాస్ స్టవ్ పైన పెనం పెట్టి వేడెక్క గానే ఈ పొడి వేసినా ఇల్లంతా చక్కని వాసనా వస్తుంది. సాంబ్రాణి పొగ కుడా ఇంతే. ఇల్లు సువాసనతో మనసు తేలికగా ఉండాలంటే ఈ సువాసనలు చాలు.

 

 

Leave a comment