Categories
అమ్మయిలకు ఫంకీ జ్యూలరీ అంటే ఇష్టం. కానీ వివిధ రకాల మెటల్స్ తో తయారయ్యే ఆర్టిఫిషియల్ ఆభరణాల వల్ల చెవి రంధ్రం వద్ద ర్యాష్ వస్తుంది. సాధరణంగా కృత్రిమమైన ఆభరణాలలో నికెల్ లోహం వుంటుంది. వీటి కారణంగా దురదలు,ఎర్రబారటం కనిపిస్తాయి. ఈ సమస్యను అలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్ నికెల్ అంటారు. ఈ సమస్య రాకుండా నికెల్ తో చేసిన ఆభరణాలు రింగులు, దిద్దులు శరీరం పైన ఎక్కువ సేపు ఉంచుకోవద్దు. చర్మం గనుక ఎర్రబడిన దద్దుర్లు వచ్చినా వెంటనే డాక్టర్ ను కలుసుకోవాలి. సమస్యను పెద్దది చేయవద్దు.