పిల్లల్లో వుండే అభ్యాస ధోరణిని పెద్దవాళ్ళే పనికట్టు కుని ప్రోత్సహించాలి. ప్రతి పిల్లల్లోనూ అంతర్లీనంగా ఎదో ఒక విషయం పై ఆసక్తి ఉంటుంది. ముందుగా దాన్ని గుర్తించి ఆదిశగా ప్రోత్సహించటం తల్లి దండ్రుల కర్తవ్యం. ఉదాహరణ కు ఆర్ట్ ఇష్టపడే పిలల్లకు ఆర్ట్ గ్యాలరీలకు తీసుకుపోవాలి. విభిన్నమైన ఆర్ట్ మెటీరియల్స్ ప్రయాగాలకు వారిసి ఎక్స్ పోజ్ చేయాలి. కొత్త విషయాలను వారిలో షేర్ చేయాలి. ప్రతి అంశాన్ని వాళ్ళతో చర్చిస్తూ ఉంటే ఆ కొత్త పరిజ్ణానం పట్ల పిలల్ల చాలా ఎగ్జయిటింగ్ గా ఫీలవుతారు. నేర్చుకోవాలనుకున్నా తెలుసుకోవాలనుకున్నా పిల్లలు చక్కగా రాణిస్తారు. కొత్త భాష కొత్త పదాలు కొత్త కళలు ఆటలు వాళ్ళకి అమితమైన ఉత్సాహం ఇస్తాయి. స్కూల్ లో పిలల్లు సాధించే మార్కుల కంటే వారు ఇష్టపడే విజ్ఞానానికి పెద్దపీట. వేయాలి. దానివల్ల అభ్యాసకులకు అత్యంత పెరుగుతోంది. ఎప్పుడైతే ఇష్టమైన పనిని నేర్చుకోవటాన్ని ఎంజాయ్ చేస్తారు. అప్పుడే మరింతగా ఉత్సాహం పెరుగుతోంది. ఇది చదువు జెనరల్ నాలెడ్జి ఎక్స్ ట్రా క్లరిక్యులర్ యాక్టివిటీస్ అన్నింటికీ వర్తిస్తుంది.