రింగ్జ్ యిటీ చదువుతుంటేనే ఎదో తమాషాగా వుంది కదూ. ఇది వినండి ఇది ఫాంటమ్ రింగింగ్ సిండ్రోమ్ అనే భ్రమ లాంటి జబ్బు అంటున్నారు వైద్యులు. తీరిగ్గా హాయిగా స్నానం చేస్తుంటే ఎక్కడో మొబైల్ మోగినట్టు అనిపిస్తుంది. ఫోన్ పక్కనే ఉంచుకుని హాయిగా టీవీ లో ఏ ప్రోగ్రామో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఫోన్ వైబ్రేట్ అయినట్లు లేకపోతే ఎస్. ఎం. ఎస్ వచ్చిన శబ్దమో వినిపిస్తుంది. ఫోన్ చెక్ చేస్తే ఇవేమీ వుండవు. మీకెందుకిలా మనం సందేహపడుతున్నామా ? ఎందుకిలా అనిపిస్తోంది అంటే అదే రింగ్జయిటీ  అని సెలవిస్తున్నారు  వైద్యులు. అంటే మొబైల్ విన్నట్లు ఓ భ్రమ తో కూడిన సెన్సేషన్. ఇదే ఇందాకా చెప్పుకున్న పొడుగాటి సిండ్రోమ్. ఇది ఈ రోజుల్లో చాలా మందికి అనుభవం మన చెవులకు శబ్దాలు వినే సెన్సెటివ్  సామర్ధ్యం 1000 నుంచి 6000 హిర్జ్ మధ్యలో ఉంటుంది. సెల్ ఫోన్ రింగింగ్ భ్రమ కేటరింగ్ లోకి వస్తుంది . ఇదెలా జరిగిందంటే సెల్ ఫోన్ లపై మనమెంత ఆధారపడి వున్నామా చెప్పేందుకు సంకేతం. ఇది జబ్బేమీ కాదు. కాకపోతే సెల్ ఫోన్స్ కు అతుక్కుపోకుండా కాస్త విశ్రాంతిగా ఉందండీ అని చెపుతోందీ  రింగ్జయిటీ .

Leave a comment