ఉత్తర ప్రదేశ్ కు బుధానా గ్రామానికి చెందిన పూజ తోమార్ యు ఎఫ్ సి ఫైట్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది.కరాటే తో పాటు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ కూడా (M.M.A) నేర్చుకుంది పూజతోమార్. మెరుపు వేగంతో ప్రత్యర్థులను మట్టి కల్పించగల నేర్పు సాధించింది. బ్రెజిల్ కు చెందిన రయాన్ అమాండా ను ఓడించి అల్టిమేట్ ఫైట్ ఛాంపియన్ షిప్ (U.F.C) లో విజయం సాధించి ఆ ఫైట్ గెలిచిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందింది.