Categories
ఇల్లు కట్టేప్పుడే గోడలకు అరలు కట్టించేస్తారు. ఇల్లు ఎంత ఆధునికంగా అలంకరించిన ఈ అరలు మాత్రం మార్చే వీలుండదు. హాల్లో చిన్న చిన్న వస్తువులు పెట్టేందుకు వాటికి తగ్గ అరలుంటే బావుండు అనుకొంటాం. ఇటలీకి చెందిన రోండా కంపెనీ మాగ్నటిక్ షెల్ఫ్ లు తయారు చేసింది. ఇవి అంటిస్తే అంటుకుపోయే చిన్న డబ్బాలాంటివి. ఈ మాగ్నటిక్ ఫలకాల ఆయస్కాంత శక్తి చాలా ఎక్కువ . ఈ అరల్లో కాస్త బరువైన వస్తువులు పెట్టిన ఊడి పడిపోవు. ఈ మాగ్నటిక్ అరలు గుండ్రంగా ఆకుల ఆకారంలోనూ ,చతురస్రాలుగా ఉన్నాయి. లివింగ్ రూమ్ లో అలంకరణ సామాగ్రి , రీడింగ్ రూమ్ లో బుక్స్ పెట్టుకొనేందుకు ఇవి ఉపయోగనడతాయి.