తుఫాన్ లో నడి సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్య కారులను రక్షించినందుకు గాను కెప్టెన్ రాధిక మెనన్ రాష్ట్రపతి ఉమెన్స్ డే సందర్భంగా నారీ శక్తి పురస్కారం తో సత్కరించారు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రేడియో ఆఫీసర్ గా కెరీర్ ప్రారంభించారు రాధిక మెనన్. 2012లో ఇండియన్ మర్చంట్ నేవీ లో కెప్టెన్ అయిన తొలి మహిళ ఆమె 22 వేల టన్నుల ఆయిల్ ట్యాంకర్ సువర్ణ స్వరాజ్య నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. 2015 తుఫాన్ లో వేటకు వెళ్లి తుఫాన్ లో నడి సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు జాలర్లను ఎంతో సమర్థతతో కాపాడి షిప్ మీదకు చేర్చారు రాధిక మెనన్. అత్యున్నత ధైర్య సాహసాలు ప్రదర్శించిన నందుకు ఇంటర్నేషనల్ మారిటైమ్  ఆర్గనైజేషన్ అవార్డును ఐ ఎం ఓ బ్రేవరీ అవార్డ్ ను అందుకున్నారు రాధిక మెనన్ .

Leave a comment