ఎర్రని స్ట్రాబెర్రీ పండ్లు వచ్చే సీజన్ ఇదే రంగు, రుచే కాదు ఆరోగ్య పరం గాను స్ట్రాబెర్రీలు ఎన్నో ప్రయోజనాలను ఇస్తాయి. కప్పు స్ట్రాబెర్రీ పండ్లలో 11 గ్రాముల పిండిపదార్ధాలు, 3 గ్రాముల ప్రొటీన్ లు అందుతాయి. కొవ్వులు చాలా తక్కువ. వీటి నుంచి 49 క్యాలరీలు లభిస్తాయి. ఇందులోని విటమిన్ సి వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తాయి. జలుబు, ఫ్లూ వంటి సమస్యలకు ఔషధం వంటిదే ఈ పండ్లు. ఎర్రని నిగనిగలాడే ఈ పండ్లతో చర్మ కాంతి పెరుగుతుంది. నేరుగా తింటే అన్ని ప్రయోజనాలు అందుతాయి. వీటిలోని ఫోలేట్, విటమిన్-సి,ఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. ఎన్నో ఆరోగ్య లాభాలున్న స్ట్రాబెర్రీలు రోజు తినడం మంచిదే.

Leave a comment