Categories
చిన్న వయసులోనే స్టార్ చెఫ్ గా పేరు తెచ్చుకున్న ముంబై కు చెందిన నియతి రావు.ఫోర్బ్స్ 30 అండర్ 30 ఏషియా 2023 జాబితాలో చోటు సంపాదించింది.కోపెన్హాగన్ లో వరల్డ్ ఫేమస్ రెస్టారెంట్ నోమాలో ఇంటర్న్ షిప్ చేసి నియతి ‘ఎక్కా’ రెస్టారెంట్ ప్రారంభించింది. 14 నెలల్లో ఎక్కా ఆసియాలోని అత్యుత్తమ రెస్టారెంట్స్ జాబితాలో చోటు సంపాదించింది.భారతీయ వంటకాలలో ఉపయోగించే దినుసులతో కొత్త ప్రయోగాలు చేసే నియతి ఎన్నో కొత్త రుచులు పరిచయం చేసింది.