పై పూతగా ఎన్నో ఖరీదైన సౌందర్య సాధనాలు వాడినా అవి పనీ అంత ప్రయోజనకరం కాదని అందమైన చర్మం కొన్ని ఆహారాలు ద్వారా కొంత శ్రద్దవల్ల సాధ్యం అవుతందంటున్నారు ఎక్స్ పర్ట్స్.ఇప్పుడు ఎండతో కాస్త క్షిణత కనిపిస్తుంది కనుక సన్ స్కీన్ మటుకు తప్పనిసరిగా వాడాలి. అలాగే లేతరంగు మాయిశ్చరైజర్ గా వాడుకోవచ్చు. ఇంతకు మించి రసాయనాలున్నా ఎలాంటి క్రీమ్ ఫౌండేషన్ ,లోషన్ లు చర్మం రంగు తెచ్చేందుకు వాడవద్దు అంటున్నారు. ఉదయాన్నే నిమ్మరసం ,తేనె తాగితే శరీరంలోని మాలిన్యాలుపోయి శుభ్రపడుతుంది.అలాగే చర్మాని చక్కగా స్క్రబ్ తో శుభ్రం చేయాలి.చాలాసార్లు నీళ్ళతో ముఖం కడుక్కోవాలి. చల్లని నీళ్ళు దోసిళ్ళతో మొహం తాకేలా కొట్టాలి. చర్మం కింద రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.ఈ ముఖం వాష్ చేసుకున్నాక టోనర్ వాడితే శరీరపు పీ హెచ్ లెవల్స్ బాలన్స్ అవుతాయి. చర్మం రిఫ్రెష్ అవుతుంది.
Categories