ఇండియన్ బోరేజ్ గా పిలిచే వాము ఆకులు వాము గింజల వాసనతో ఉండటం వల్ల వాటిని ఆ పేరుతో పిలుస్తారు.ఈ ఆకులతో ఎన్నో వైద్య ప్రయోజనాలు ఉన్నాయి.పది పన్నెండు వాము ఆకుల్ని నీళ్ళలో వేసి అవి నాలుగో వంతు వరకు తక్కువ మంట పైన మరిగించి ఆ కషాయాన్ని తాగితే దగ్గు, జలుబు, బ్రాంకైటిస్ వంటివి తగ్గుతాయి.పిల్లలకు కాస్త సైంధవ లవణంలో కలిపి మరి ఆ రసం తాగితే జలుబు దగ్గు తగ్గుతాయి.వాముకు అల్లం కలిపి ఆ రసం తాగితే ఆకలి పెరిగి అజీర్తి తగ్గుతుంది.

Leave a comment