ఇరవై రెండేళ్ల వయసులో ప్రియా పాల్ ది పార్క్ హోటల్స్ చైర్మన్ బాధ్యతలు చేప్పట్టారు. విశాఖపట్నంలో ఆమె తండ్రి సురేంద్ర పాల్ నిర్మించిన ది పార్క్ హోటల్ ఆంధ్రప్రదేశ్ లో తోలి ఫైవ్ స్టార్ హోటల్. ప్రియా నవ్య నవీనంగా పార్క్ హోటళ్లను తీర్చిదిద్దుతున్నారు. బెంగుళూరు, చెన్నయ్, కలకత్తా న్యూఢిల్లీ ,విశాఖపట్నం హైద్రాబాద్ ,గోవా వంటి వాణిజ్య పర్యాటక ప్రాంతాల్లో కొత్త హోటళ్లు నిర్మించారామె. ప్రపంచ ఉత్తమ 101 హోటళ్ల జాబితాలో పార్క్ బెంగుళూరు హోటల్ ప్రత్యేక డిజైన్ తో ఉంటుంది. ఒక్క హోటల్ ఒక్క ధీమ్ తో ఉంటుంది. ఆతిధ్య రంగంలో కృషికి గుర్తుగా భారత ప్రభుత్వం ప్రియా పాల్ ను పద్మశ్రీ తో సత్కరించారు. వ్యాపారానికి పరిమితం కాకుండా సేవా రంగంలోనూ ముందున్నారు ప్రియ. పశ్చిమ బెంగాల్ లో ఎన్నో పాఠశాలలు అస్సాం లో గొట్టపు భావులు. ఢిల్లీ లోని జంతర్ మంతర్ సంరక్షణ బాధ్యత ప్రియా పాల్ సేవా కార్యక్రమాలకు నిదర్శనాలు.
Categories