పిల్లలను బయటికి తీసుకుపోయేటప్పుడు న్యాపీలు వాడతారు. కానీ వాటినీ నిరంతరం పిల్లల వంటిపై ఉండనిస్తే న్యాపీర్యాష్‌ వస్తుంది .దానితోచర్మంపై దురదలు ,ఆ ప్రదేశం కందిపోయి ఎర్రగా మారి దద్దుర్లు వస్తాయి. అలా ఎర్ర బడ్డ చోట కొబ్బరి నూనె రాస్తే సమస్య పెరగదు . ఎరుపు తగ్గి చర్మం మామూలుగా అయ్యేవరకు గంటగంటకు నూనె రాయాలి. చర్మానికి కలబంద గుజ్జు రాసిన ఉపశమం కలుగుతుంది . నీళ్లు, ఆలివ్‌ ఆయిల్ కలిపి చర్మం ఎర్రగా అయిన చోట రాస్తూ ఉండాలి. ఆలివ్ నూనె కందిపోయిన ఎరుపును తగ్గిస్తుంది. పిల్లలు న్యాపీకి పాడు చేసుకొంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఎప్పుడు ఇలా న్యాపీలు వాడటం సమస్య అవుతుంది. వాటికంటె మెత్తని వస్త్రంతో కుట్టిన వస్త్రాలు తొడగటం మంచిది.

Leave a comment