నీహారికా,
అత్తాకోడళ్ళ మధ్య వుండే బంధాన్ని అనవసరంగా అపహాస్యం చేస్తున్నారనిపిస్తుంది. ఎక్కడో కొన్ని కుటుంబాల్లో నాసంసారం, నా ఇల్లు నా ఇష్టం అనే పేరుతో కోడళ్ళ సరిహద్దులు గీసే ప్రయత్నం మాత్రమే అత్తా కోడళ్ళ సంబంధాల లో ఘర్షణకు దారి తీస్తుంది. అలాగే పెళ్ళయిన అమ్మాయి అందమైన వైవాహిక జీవితం గడపాలనే పది మంది లో ఆదర్శ జంటగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటుంది. తన సంసారాన్ని ఎవరి ప్రెమేయం లేకుండా తీర్చి దిద్దుకోవాలని అనుకోవడం అత్యాస మాత్రం కాదు అది సహజం. అయితే ఈ తరం ఆలోచనలను ఆంక్షలను మారుతూ వస్తున్న పరిణామాలను అత్తారు కుడా గుర్తిస్తున్నారు. అలా గుర్తించలేని సంధర్భాలలోనే అత్తా కోడళ్ళ మద్య స్పర్ధలు రావడం కుటుంబంలో ఇబ్బందికర వాతావరణం చూటు చేసుకోవడం జరుగుతుంది. అత్తగారి ఆలోచనలు తెలుసుకని, ఆమె తన తల్లి వంటిదే నని కోడలు, మన ఇంటికి, మనలో ఒకరుగా జీవించేందుకు అమ్మానాన్నలను వదిలి వచ్చినా కోడలికి తనే కావాలని ఆమెను అపురూపంగా చూసుకోవాలని అత్తగారు అనుకుంటే సమస్యలే లేవు కదా. ఇదే అత్తాకోడళ్ళ బంధం. దీన్ని బలపరిచి కుటుంబ సంభందాలను మరింత పటిష్టం అయ్యేలాగా చూసుకోవాలని కుటుంబ సభ్యులు అందరు భావిస్తే ఇక ఆ ఇల్లే స్వర్గం ఏమంటావు.