పట్టు దారం కోసం పట్టు పురుగులను (కకూన్) వేడి నీళ్ళల్లో పడేసి ఆ దారాన్ని వలుచుకుంటారు. కానీ జ్ఞానం వున్న మనిషిగా జీవన వైవిధ్యాన్ని ప్రకృతి ధర్మాన్ని కాపాడాలని నోరు లేని పట్టు పురుగులను హింసించకూడదు అని అలోచించి వరంగల్ జిల్లా నాగారం గ్రామానికి చెందిన కుసుమ రాజయ్య అహింసా పద్దతిలో ఆలోచించారు. పట్టు పురుగులను చంపకుండా దారం తీసే పద్దతిని కనిపెట్టారు. ఈ దారానికి కొంచం మెరుపు తక్కువ. కానీ మృదువుగా వుంటుంది. నాణ్యతలో లోపం ఉండదు. ఈ పట్టుకి అహింసా పట్టు అని పేరు పెట్టారు.ఈ అహింసా పట్టుకు పేటెంట్ హక్కులు సంపాదించుకున్నారు. దేశ విదేశాల్లోని పలు రాష్ట్రల్లో అనేక ఎగ్జిబిషన్స్ లో ఈ అహింసా సిల్క్ ప్రదర్శించి చూపారు. ఈ వస్త్రాల నాణ్యత వాటిలో ఉపయోగించే రంగుల మేళవింపు, ముఖ్యంగా పట్టు పురుగును చంపకుండా దారం తీయడం ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. ప్రముఖ దేశాల్లో దేవతా మూర్తులను ఈ పట్టు వస్త్రాల తో అలంకరిస్తున్నారు. తనకు దివంగత రాష్ట్రపతి వెంకటరామన్ సతీమని జానకీ వెంకటరామన్, ఈ పట్టు పురుగులను చంపకుండా తీసిన దారంతో నేసిన వస్త్రం కావాలని అడిగి స్ఫూర్తినిచ్చారు అంటాడు రాజయ్య. ఎన్నో పట్టు పురుగులకు ప్రాణదానం చేసిన కీర్తి జానకీ వెంకటరామన్కి దక్కుతుంది అన్నమాట.

Leave a comment