సపోటా ని తియ్యని పండే  అనుకుంటాం కదా. కానీ ఈ పండు శిరోజాలను దృష్టినీ పరిరక్షిస్తుంది. నడుము కొలతల్ని సమంగా ఉంచగలుగుతోంది. బరువు తగ్గాలని ప్రణాళిక వేసుకున్నా  వాళ్ళకి ఇది మంచి ఆహారం. సపోటా లో ఎక్కువ శాతం పీచు కూడా వుంది. అంచేత దాన్ని భోజనానికి ముందు తీసుకోవటం వల్ల  ఉదర ఎంజైమ్ల విడుడలను క్రమబద్దీకరించటంలో సహకరిస్తుంది. సపోటా జ్యూస్ లోకి విటమిన్ సి జుట్టు కుదుర్లు  సరిచేసి ఎదుగుదలకు సహకరిస్తుంది. సపోటా లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్లు ఎ,సి ఇ  లు ఖనిజాలు పొడిచర్మానికి తగిన తేమ అందిస్తాయి. చర్మం సహజ టెక్చర్ ను కాపాడి కాంతివంతంగా ఉంచ గలుగుతుంది. సపోటా జ్యూస్ ఎనెర్జీ డ్రింక్. ప్రాక్టోజ్  సుక్రోజ్ లాంటి చక్కెర లు శరీరానికి తక్షణ శక్తి ఇస్తాయి. ఉదయం వేళ  సెరల్స్ లో మధ్యాహ్నం లంచ్ లో సపోటా కలుపుకంటే చాలినంత శక్తి  వస్తుంది. విటమిన్ ఎ  పుష్కలంగా వుండి  కంటి దృష్టి  బావుండేలా చేస్తుంది. రోజుకు సపోటా తప్పకుండా తింటే ఎంతో ఆరోగ్యం ఇది సౌందర్య ఫలం.

Leave a comment