కూరల్లో వేసే తాలింపు ఆవాల చిటపటలు వింటాం. ప్రయోజనాల గురించి పెద్దగా తెలియక పోయినా అలవాటుగా పోపుల పెట్టిలో ఆవాలు, జీలకర్ర ఉంటాయి. ఫిటో న్యూట్రియింట్స్, ఖనిజాలు, విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఆవాల్లో. నియాసిన్ లేదా విటమిన్ బి3 అత్యధిక స్థాయిలో ఉంటాయి కోలెస్ట్రోల్ తగ్గిస్తాయి ఆవాలు. వీటిలో వుండే ముసిలేజ్ అనే చిక్కటి పదార్ధం మలబద్దకం రానీయదు. యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాల వల్ల కండరాళ్ళు, ఆర్దరైటీస్ నొప్పుల నుంచి ఉపసమనం లభిస్తుంది. గోరు వెచ్చని ఆవనూనె తో వారానికో సారి మసాజ్ చేసుకుంటే వత్తిడి తగ్గిపోతుంది. అరటీ స్పూన్ ఆవాలు నోట్లో వేసుకుని చప్పరిస్తే పంటి నొప్పి తగ్గిపోతుంది. యాంటీ ఫుంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాల వల్ల సాధారణ చర్మ సమస్యలతో పోరాడే గుణం అవనునేలో ఉంది. అవపిండిలో నువ్వుల నూనె కలిపి మొటిమల పై రాస్తే తగ్గిపోతాయి.

Leave a comment