Categories
గర్భిణిగా ఉన్నప్పుడు సీమంతం చేసి మట్టీ గాజులు తొడగడం సంప్రదాయం. ఇప్పుడు కొత్త పరిశోధన అది చాలా అర్ధవంతమైన పని అంటున్నాయి. గర్భవతి చేతికి ఉన్న మట్టి గాజులు చిన్న కదలికలో కూడా ఒక కొత్త శబ్దం చేస్తాయి. శిశువు కొత్తగా శబ్దాలు వినేందుకు ప్రయత్నం చేస్తుంది. ఆ చిన్న చేవులకు వినికిడి వ్యాయామం ఈ గాజుల శబ్దం తో మోదలవుతుంది అంటున్నాయి పరిశోదనలు . ఈ గాజుల శబ్దం దగ్గరగా వింటూ తన తల్లి ఉనికిని పసి గట్ట గలుగుతుంది శిశువు అంటున్నారు . ఈ పరిశోధనలో నిజనిజాలు సంగతి ఎలా ఉన్న పసి పాప చెవులకు ఈ సున్నితమైన శబ్దం వినపడి ఆనంద ఫెట్టడం అన్న మాటే సంతోషం కలిగిస్తుంది.