ప్రతి ఉదయాన్ని హుషారుతో వెలిగిస్తేనే రోజంతా ఆహ్లాదంగా వుంటుంది. నిద్ర ఎన్ని గంటలు సరిపోతుందో, బద్ధకం లేకుండా వుంటుందో సరిచూసుకుని మెలకువ రాగానే లేచి పోవాలి. రాత్రి పడుకునే ముందర కిటికీ కర్టెన్ వేసి, గదిని చీకటిగా ఉంచాలి. నిద్ర లేస్తూనే ఫోన్ చేత్తో పట్టుకుని, ఇమెయిల్స్, ఫేస్ బుక్ చూసుకోవడం వద్దు. లేవగానే గ్రీన్ టీ తాగడం, పది నిమిషాలు నడకతో శరీరానికి చురుకుదనం తేవడం మంచిది. ఉదయం వేల శరీరం వత్తిడిని నిరోధించే కార్టిస్టాల్ హార్మోన్ విడుదల అవ్వుతుంది. అప్పుడు కాఫీ తాగటం మంచిది కాదు. అలాగే పాస్తా, బ్రెడ్, దోస, ఇడ్లీ వంటి టిఫిన్ల కంటే చెక్కర స్దాయి అదుపులో వుండే ఆహారం తీసుకుంటే రక్తలో చక్కర స్దాయి అదుపులో వుంటుంది. కడుపు నిండిన భావన కుడా కలుగుతుంది.

Leave a comment