అత్యాచారాలకు సంబంధించిన వార్తలు వింటుంటే ఎంతో బాధ కలిగేది. మనం ఏమీ చేయలేమా అనే ప్రశ్న ఎదురయ్యేది. అందుకే స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాను అంటుంది బాలీవుడ్ నటి యామీ గౌతమ్. మజలీస్,పరి అనే స్వచ్ఛంద సంస్థ లతో కలిసి పని చేస్తున్నాను. ముంబై కేంద్రంగా పనిచేసే మజలీస్ 1991లో ఫ్లావియా స్థాపించారు. ఆమె ఒకప్పుడు గృహహింస బాధితురాలు. ఇందులో సభ్యులు ఎక్కువ మంది లాయర్లు. తాజా చిత్ర ఫాదర్స్ డే లో నైనా జైస్వాల్ అనే అత్యాచార బాధితురాలి పాత్రలో నటించాను. వ్యవస్థ లోపాలను ప్రశ్నించడంతో పాటు మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుందీ సినిమా అంటోంది యామీ గౌతమ్.

Leave a comment