నీహారికా,
సగం సమస్యలు సాటి మనిషిని మనిషిగా చూడకపోవడం వాళ్ళ వస్తున్నాయంటున్నారు ఫ్యామిలీ కౌన్సిలర్స్. ప్రతి క్షణం కష్టపడే ఇల్లాలిని ఎంత కష్టపెడుతున్నావు, నీకేమైనా సాయం కావాలా అన్న ఆదర పూర్వకమైన మాటలు దొరక్క డిప్రెషన్ లో పడిపోతుందిట. నిజానికి ఏ ఇల్లాలూ తాను చేస్తున్నది శ్రమ అనుకోదు. శ్రమ చేయడం చిన్న తనంగానూ భావించదు. కానీ భర్త తన శ్రమను గుర్తించకపొతేఅ. పురుషులు ఈ పాయింట్ ని సరిగ్గా అర్ధం చేసుకోవాలి. ఏదయినా ఇంటి నుంచి వచ్చి తనను సర్వస్వంగా భావించి వినయ విదేయతలతో ఇంటి చాకిరీ చేస్తూ అందరి ఆరోగ్యం పట్టించుకునే ఇల్లాలిని ఎంత వరకు ఆదరిస్తున్నారు. నువ్వు తప్పా నాకు వేరే ప్రపంచం లేదనే భావన కల్పిస్తున్నారా? ఆమె శ్రమను గౌరవిస్తున్నారా? గుతిస్తున్నారా? లేదనే భావన కల్పిస్తున్నారా? ఇద్దరు ఇంటి బాధ్యతల్లో చేరు సగంగా ఉన్నారా? లేదా? చిన్ని చిన్ని కారణాల తో కేచులాడుకొని ఇంట్లో శాంతి కి భగ్నం కలిగిస్తున్నారా? భార్య స్వయం నిర్ణయాధి కారం కలిగి వుండా? ఇవన్నీ పురుషులు ఆలోచించుకుంటే భార్య వీటన్నింటికీ సరిపోయేంత సమర్ధవంతంగా ఓర్పుగా, నేర్పుగా కుటుంబ శ్రేయస్సు ఆశించేలా వుంటే ఇప్పుడా ఇల్లు నందన వనం. ఫ్యామిలీ కౌన్సెలర్స్ చెప్పేది ఇదే. ఒక ఇంటిని స్వర్గంగా మార్చుకోవలసిన బాధ్యత భార్యలదే.