అన్ని విధాల ఉపయోగపడే చక్కని హాండ్ బాగ్ కాస్త ఖరీదు ఎక్కువే.కానీ కోద్దిపాటి జాగ్రత్తలతో దాన్ని ఎక్కువ కాలం మన్నెలా చేయచ్చు. సాధారణంగా బ్యాగ్ కు జిడ్డు మరకలు పడిపోతూ ఉంటాయి. బేబీ పౌడర్ దాని పైన చల్లి రాత్రంత వదిలేసి ఉదయాన్నే దులిపేస్తే మరకలు పోతాయి. మురికి పట్టి పాత బ్యాగ్ లా అనిపిస్తే ఒక బ్రడ్ స్లయిస్ తో దాన్ని తుడిస్తే మురికిపోయి కొత్తగా కనిపిస్తుంది. బ్యాగ్ ఆకృతి బావుండాలంటే అవసరాన్ని మించి వస్తువులతో బ్యాగ్ నింపవద్దు. బ్యాగ్ ను దిండు కవర్ లో పెట్టి అల్మారాలో భద్రం చేయాలి. అలాగే అలంకరణ వస్తువులు బ్యాగ్ లో అలాగే పడేస్తే లిప్ స్టిక్ మూత ఊడి పోయినా క్రీముల మూతలు లూజైనా అవన్ని బ్యాగ్ ను అంటుకొని వదలవు ,వాటిని వేరే చిన్న క్లాత్ బ్యాగ్ లో పడేసి బ్యాగ్ లో పెట్టుకొంటే సరిపోతుంది.
Categories