పల్లెటురుల్లోనే వ్యవసాయం చేస్తారనుకోవడం ఇంక కుదరదు. పట్టనాల్లోని బాల్కనీ లోనే పంట పొలాలు కూరల దిగుబడులు ఇస్తున్నాయి. ఈ విషయంలో సలహాలు ఇచ్చేందుకు ముంబాయ్ కి చెందిన ప్రియాంకా అమర్ షా iKheti అని సమష్టి వ్యాపార సంస్ధను ప్రారంభించింది. పట్టణ వ్యవసాయం గురించి వివరించడం ఒక సామాజిక బాధ్యతగా తీసుకుంది ప్రియాంకా. కొత్తిమీర, కరివేపాకు తో మొదలు పెట్టి అవి పెరిగేలోగా నిమ్మ వంటివి పెంచేందుకు శిక్షణ ఇస్తానని ఇవన్నీ ఆహారంలో నిత్యం ఉపయోగ పడతాయని ప్రియాంక చెప్పుతుంది. కేవలం పది అంగుళాల స్ధలం వుంటే ఇటలీ వంటకాల్లో ఉపయోగించే ఇటాలియన్ బాసిలియన్, బరేగానో, సేలరీ వంటి పంటలు పండించవచ్చని ప్రియాంకా సలహా ఇస్తుంది. ఇప్పుడిప్పుడే పట్టణాల్లో యువతీ యువకులు ఇంటి పంటలు సాగు చేస్తున్నారు.
Categories