Categories

ఒక ఆర్టిస్ట్ సృజనకు హద్దులు ఉండనే ఉండవు Anna Chojnicka అనే బ్రిటన్ కు చెందిన ఆర్టిస్ట్ అరటిపండు పైన అద్భుతమైన చిత్రాలు రూపొందించి ఇయర్ బడ్స్,తల పిన్నులు ఉపయోగించి అరటిపండు పైన వివిధ రూపాలు వచ్చేలా నొక్కేది. కాసేపటికి ఆ నొక్కిన ప్రాంతం కాస్త నల్లగా మారి బొమ్మలు కనిపించేవి ఉదయిస్తున్న సూర్యుడు, ఎగురుతున్న పక్షులు, చెట్లు, ఏనుగులు ఏదైనా సరే అరటిపండు పైన చిన్న పాటి ఒత్తిడితో సృష్టించేస్తుంది అన్నా. ఆమె ఎలాంటి రంగులు వాడకుండా కేవలం అరటిపండు పైన ఒత్తిడితోనే ఇంత అద్భుతమైన కళాఖండాలు సృష్టించటం పట్ల ప్రపంచవ్యాప్తంగా కళ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.