బంగారం అరవై తులాలకు మించి ఉంటే ప్రభుత్వం లాగేసుకుంటుందా అనే సందేహం చాలా  మందిని వేధిస్తోంది. ప్రభుత్వం అలా  ఏమీ లాక్కోదు. పరిమితికి మించిన బంగారం ఎలా సమకూర్చుకోగలిగారో వివరణ ఇవ్వగలగాలి. వారసత్వంగా వచ్చిందనుకోండి. విల్లు ప్రకారం వచ్చిన బంగారం పైన ఇద్దరు సాక్షి సంతకాలు ఉంటే చాలు. బహుమతిగా వచ్చిన బంగారాన్ని అమ్మాలంటే ఆనాటి ధర ఇప్పటి ధరల మధ్య వ్యత్యాసం పై పన్ను కట్టాలి. కేంద్ర ప్రభుత్వం గోల్డ్ డిపాజిట్ స్కీం 1999 ప్రకారం 2000-01 నుంచి గోల్డ్ డిపాజిట్ బ్రాండ్లను జ్యూవెలరీ కేంద్రం  పరిగణించకుండా సెక్షన్-2 కి సవరణ ఇచ్చింది. గోల్డ్ డిపాజిట్ బ్రాండ్లు ఆస్తులుగా పరిగణించారు. వ్యయసాయ ఆధారిత కుటుంబాలైతే వ్యవసాయ ఆదాయం పై పన్ను లేనట్లే వ్యవసాయ ఆదాయం తో కొనుగోలు చేసిన బంగారం పై  ఎలాంటి పన్ను ఉండదు. పుట్టింటి నుంచో బహుమతిగానో మరేవిధంగానో వచ్చిన బంగారానికి ఆధార పత్రం  ఉండేలా చూసుకుంటే చాలు. ఒక చిన్న మధ్య తరగతి కుటుంబంలో 60 తులాల కంటే ఎక్కువ బంగారం వుండే అవకాశం వుంటుందా చెప్పండి. ఆదాయానికి మించిన అక్రమార్జన ఉంటేనే లెక్కలు బయటకి వస్తాయి.

Leave a comment