టీనేజ్ లోకొచ్చాక పిల్లల్ని గాజు బొమ్మల్లాగా హ్యాండిల్ చేయాలి. అంటున్నారు ఎక్స్పర్ట్స్. వాళ్ళతో భావోద్వేగాలు ఎక్కువే వుంటాయి. కానీ పెద్దవాళ్లలాగా వాటిని నియంత్రించుకోలేరు. వాళ్ళు ముభావంగా ఉన్నా కోపంగా వుంటున్నా ప్రతి దానికీ కనీళ్ళు పెట్టుకున్నా కారణాలు తెలుసుకునేందుకు సున్నితమైన ప్రయత్నం చేయాలి. తోటి పిల్లల్తో సర్దుకోలేకపోతున్నా ఏదైనా లైంగిక హింసకు గురవుతున్నారా లేదా ఏదైనా సున్నితమైన విషయాన్ని బయటకు చెప్పలేకపోతున్నారా? ఏదైనా వత్తిడి లోనయ్యారా ? అన్ని విషయాలను తరచి అడిగి తెలుసుకోవాలి. తల్లితండ్రుల కంటే దగ్గరైనవాళ్లు వాళ్ళకెవరూ ఉండరు. ఎలాంటి సమస్యకైనా అండదండలుగా ఉంటామనే నమ్మకాన్ని పిల్లలో చిన్నపటినుంచి కలిగించగలిగే గొడవే లేదు. వాళ్లకు సంబంధించిన ఈ ప్రాబ్లమైన మొదటిగా తల్లితండ్రికే చెప్పుకుంటురు. మార్కులు వచ్చినా తెలివిగా ప్రవర్తించలేకపోయిన ఇతరుల ముందు వాళ్ళను చిన్నపుచ్చటం చాలా తప్పు. ఆరోగ్యంగా లేకపోయినా శారీరిక లోపం ఒత్తిడీ సరిగా చదవలేక పోయినా వాళ్ళు భయపడాయి చెప్పుకోలేకపోతారు. లేదా దృష్టి లోపం విరికిది సమస్యలు తలెత్తినా వాటిని చెప్పుకోలేక మౌనంగా ఉన్న తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఎదిగే క్రమంలో ఎదురయ్యే ఎలాంటి అనుభవానికైనా తోడుగా ఉండాలి.
Categories