తాంబూలం లో వాడే తమలపాకులు ముఖాన్ని మెరిపించటంలో ముందుంటాయి. తమలపాకుల రసం వేసిన నీటితో స్నానం చేస్తే శరీరం సువాసనతో ఉంటుంది. తమలపాకులను పేస్ట్ గా చేసి రాస్తే మొటిమలు మచ్చలు పోతాయి. తమలపాకు రసం కలిపిన నీటితో ప్రతిరోజు మొహం కడుక్కుంటే మలినాలు పోయి మొహం శుభ్రం అవుతుంది. ముల్తానీ మట్టి లో తమలపాకులు పేస్ట్ కలిపి ప్యాక్ అప్లై చేస్తే మేనిఛాయ మెరుగవుతుంది. కొబ్బరినూనె లో తమలపాకుల పేస్ట్ కలిపి తలకు రాసుకుంటే జుట్టు ఊడటం తగ్గుతుంది.

Leave a comment