కింజల్ సింగ్ ,ప్రంజల్ సింగ్ తండ్రి కె.పి సింగ్ డిఎస్పీ ఆయన బందిపోటు దొంగల దాడికి గురై చనిపోయడని ఆ తరువాత ఆ దొంగలను ఎన్ కౌంటర్ లో కాల్చేశారని ఆయన తోటి అధికారులు సమాచారం ఇచ్చారు. కానీ ఆయన తోటి అధికారులు లంచాలు తీసుకొని నేరాస్తులకు సహాకరిస్తున్నారని కె.పి సింగ్ కనిపెట్టడని అందుకే ఆయన తోటి వారే ఆయన్ను చంపేశారని ఆయన భార్య విభాసింగ్ న్యాయం కోసం హైకోర్టు కెక్కింది. తండ్రి పోయేసరికి కింజల్ ఐదు నెలల పాప, ప్రింజల్ ఇంకా తల్లి కడుపులోనే ఉంది. ఈ ఇద్దరూ అక్కచెల్లళ్లు పెరిగి పెద్దవారై ఐ.ఎ.ఎస్ ,ఐ.ఆర్.ఎస్ లు సాధించి ,మధ్యలో తల్లి చనిపోయినా ఈ కేసు ను వదలకుండా పట్టుకొని నేరం జరిగినా 31 ఏళ్ళకు తండ్రిది హాత్యేనని నిరూపణ అయ్యో వరకు పోరాడారు. అందరికీ శిక్షపడింది. లకింపూర్ భేదా జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్నా కింజల్ ఆనందంతో ఏడ్చేసిందట. ఈ అక్క చెల్లెళ్ళ కథ ఏ సినిమా కథకీ తీసిపోదు.