Categories
బంగారు ఆభరణాలు ఎంత కాలమైనా మెరుపు పోకుండా తళ తళా మెరుస్తూ ఉంటాయి. అయితే కొంత కాలానికి ఆ కొత్త మెరుపు పోతుంది. ఆ కాస్త షైనింగ్ కుడా పోగొట్టు కోకుండా ఆభరణాలు మెరుగుతో వుంచుకోవాలి అంటే కొన్ని జాగ్రత్తలు తెసుకోవాలి. నాలుగు వంతుల వేడి నీటి లో ఒక వంతు అమోనియా కలిపి ఓ నిమిషం ఆభరణాలు అందులో పడేయాలి. తర్వాత మెత్తని బేబీ బ్రష్ తో క్లీన్ చేయాలి. చాలా మంది బంగారాన్ని క్లీన్ చేసందుకు నాన్-అబ్రాసిం టూత్ పేస్టూ లేదా పౌడర్ వాడతారు. మెత్తని కాటన్ బట్టపై కష్ట మోతాదులో ఈ టూత్ పేస్టూ లేదా పొడి తీసుకుని దానితో ఆభరణాలు మసాజ్ చేస్తున్నట్లు తుడిచి, తర్వాత గోరువెచ్చని నీటి తో తడిపిన టవల్ తో తుడిచేయాలి. ఇలా చేస్తూ భద్రం చేస్తే ఆభరణాలు మెరుపు పోగొట్టుకోకుండా ఉంటాయి.