Categories

ఎన్నో శుభకార్యాలు ,ప్రత్యేక రోజులు ,సరదాగా ఈవినింగ్ షికార్లు ,పార్టీలకు రకరకాల చీరెలు ,నగలు ఉంటాయి. ఎలాంటి దుస్తులకు ఏం నగలు ఎంచుకోవాలో ఎప్పుడు సమస్యే .ఏ ఆభరణాలకు ఏ రంగులు నప్పుతాయి. బ్లాక్ అండ్ వైట్ బంగారానికి పర్ ఫెక్ట్ మ్యాచింగ్ ,బంగారు నగలకు ఈ కాంభినేషన్ బావుంటుంది. సాయంత్రం వేళల్లో డీప్ బ్లూ వంటి గాఢమైన రంగులకు బంగారు నగలే అందం ఇస్తాయి. ఇక నలుపు ఎప్పుడూ తిరుగులేని ఫ్యాషన్ .సిల్వర్ ఆభరణాలు,బంగారు ఆభరణాలు కూడా నలుపుకి చక్కగానే మ్యాచ్ అవుతాయి. డీప్ బ్లూ డ్రెస్ కు వెండి నగలు అందం ఇస్తాయి. పగటి వేళల్లో లైమ్ గ్రీన్ ,బేబీ పింక్ కలర్ చాలా అందం ఇస్తాయి. బంగారు వెండి నగలు ఈ రంగులకు చక్కగా ఉంటాయి.