ఉదయం వేళ సాధరణంగా ఇడ్లీ,దోసె తింటాం కానీ ఎప్పుడు అదే కాకుండా రెండు మూడు రకాలతో శక్తి,పోషకాలు అందేలా చూసుకోవచ్చు.ఓట్స్ ఇవి మంచి అల్పాహారం. ఇందులో బీట గ్లూకోన్ ఉంటుంది.శరీరంలో కొవ్వును తగ్గించగలదు. మాంసకృత్తులు ఉండాలనుకుంటే పాలలో ఉడికించి తీసుకోవచ్చు.లేదా ఉదయాన్నే ఓట్స్ ను పెరుగు ,ఇడ్లి రవ్వతో కలిపి ఇడ్లీగా వేసుకుని తినవచ్చు.జతగా ఉడికించిన గుడ్డు చీజ్ వంటివి పండ్ల ముక్కలు తీసుకున్న మంచి ఆహారం అవుతుంది.పండ్లలో ఎన్నో పోషకాలు పొటాషియం,పీచు ఉంటాయి.ఉదయపు ఆహారంలో పండ్లు తప్పనిసరిగా ఉండాలి. గుడ్లు,పెరుగు,పండ్ల ముక్కలు కూడ మంచి శక్తిని ఇస్తాయి.

Leave a comment