Categories
జీవితంలో అన్నీ దొరికాయి కానీ నా సొంత సంపాదన అంటూ లేనే లేదు అని దిగులు పడింది 90 ఏళ్ల హర్భజన్ కౌర్. కూతురు ఆమె దిగులు చూసి చండీఘడ్ సెక్టార్-18 లో చిన్న స్టాల్ పెట్టే సాయం చేసింది. శనగపిండితో చేసిన బర్ఫీ లు అమ్ముతాను. మా పూర్వీకులకు కూడా ఈ బర్ఫీ లు చేయటం వచ్చు అన్నది 90 ఏళ్ల హర్భజన్. మొదటి రోజే మూడు వేల రూపాయలు వచ్చాయి ఆమె తయారు చేస్తున్న బర్ఫీ ల వీడియోను ఆనంద్ మహేంద్ర ట్విట్టర్ లో షేర్ చేస్తే విపరీతంగా వైరల్ అయింది. ఇప్పుడు హర్బజన్ ను అందరూ బర్ఫీ బామ్మ అంటున్నారు. ఆమె వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది.