Categories
పాడైపోయిన పాలు చెత్త బుట్టలో వేయకండి, వాటిని మొక్కలకు పోస్తే మంచి పోషణతో పాటు ఆరోగ్యం కూడా అంటోంది సమంత.ఎక్సపైరీ దాటిపోయిన పాల ప్యాకెట్ పాలడబ్బా ల లోని పాలు ఆరోగ్యానికి మంచివి కావు.అవి మొక్కలకు మంచి ఎరువుగా పనికి వస్తాయి.ఆ పాలలో యాంటీ ఫంగల్ యాంటీ పెస్టిసైడ్ గుణాలుంటాయి పాలలోని కాల్షియం మొక్కలు పెరిగేందుకు తోడ్పడతాయి.టమాటో, దోస, గుమ్మడి మొక్కల్లో పూత రాలిపోవడాన్ని అడ్డుకుంటాయి. పాలలో ఉండే అత్యవసర /ప్రోటీన్లు విటమిన్ బి మొక్కలను పూర్తి ఆరోగ్యంగా ఉంచటంలో సాయపడతాయి అని చెబుతోంది సమంత. తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో మొక్కల సంరక్షణ గురించి వివరించింది సమంత.