మన దేశంలో దేవతగా పూజించే తులసి మొక్క ఎంత ప్రాముఖ్యమైందో మన అందరికి తెలిసిందే.. అయితే తులసి ఆకుల వలన కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.. అవేంటో మీరే తెలుసుకోండిభారతదేశ సంప్రదాయంలో దేవుడితో సమానంగా కొలిచి, పూజలు చేసే చెట్టు తులసి. వంటలలో కూడా దీని తులసి ఆకులను వాడుతుంటారు. అంతేకాకుండా, అన్ని విధాల ఆరోగ్యాన్ని పరచటమే కాకుండా, అందరి ఇళ్లలో దేవతగా కొలవబడే చెట్టు “తులసి”. తులసి ఆకులు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉండటం వలన అన్ని రకాల రోగ కారకాలకు వ్యతిరేఖంగా పని చేస్తుంది. వీటిలో, ఫ్లావనాయిడ్ లు, యాంటీ వైరల్ గుణాలు కలిగి ఉండి, అనేక విధాలుగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, సహజంగా రోగనిరోధక శక్తిని పెంచే ఐరన్, విటమిన్ ‘A’, విటమిన్ ‘C’, పొటాషియం మరియు కాల్షియం వంటి పోషకాలను కలిగి ఉంటుంది.
రోజు తులసి ఆకులను వాడటం వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ విశదీకరించబడింది
పంటి నొప్పి ఎండబెట్టిన తులసి ఆకులను పొడిగా చేసి, దీనికి ఒక చెంచా ఆవాలు నూనె కలిపిన మిశ్రమాన్నినొప్పిగా ఉన్న దంతాలకు పూసి, రాత్రంతా అలానే ఉంచండి. మరుసటి ఉదయం నుండి ఖచ్చితంగా, దంతాలలో కలిగే నొప్పి నుండి ఉపశమనం పొందుతారు. తులసిని యాంటీ- డిప్రెషన్ ముందుగా కూడా కూడా ఉపయోగించవచ్చు. రోజు రెండు సార్లు, 10-12 తులసి ఆకులను నమలటం వలన మెదడుకు కావలసిన ఆక్సిజన్ సరఫరాను సజావుగా జరిపి, ఒత్తిడి మరియు ఆందోళనలను దూరం చేస్తుంది. ఎండలో ఎండబెట్టిన తులసి ఆకులను తీసుకొని, రాత్రి నీటిలో నానబెట్టిన వాటికి, రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించే శక్తి ఉంటుంది. అంతేకాకుండా, ఇవి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే శక్తిని కలిగి ఉండి, ఆరోగ్యకర స్థాయిలో మధుమేహ వ్యాధిని నిర్వహిస్తాయి.