Categories
ఈ చిత్రం లో ఒక బౌద్ధ సన్యాసి బుద్ధుని భౌతికకాయం దహనం చేశాక ఒక దంతాన్ని సేకరించి కళింగ రాజు బ్రహ్మదత్తుడికి బహుకరిస్తున్న సందర్భం కనిపిస్తుంది . ఈ దంతాన్ని ఒక రత్న ఖచ్చితమైన పీఠికలో ఉంచి బ్రహ్మదత్తుడు పూజించేవాడట . అయన రాజధాని పేరే దంతపురి అని పెట్టుకొన్నాడాయన . ఇప్పుడు శ్రీకాకుళం దగ్గర్లో ఉన్నా దంతపురికోటను ఆ ప్రాచీన నగరంగా చరిత్ర కారులు గుర్తించారు . దీనికి సంబంధించిందే ఈ చిత్రం. తేలికైన రంగుల్లో రాజు బౌద్ధ భిక్షువు ఆస్థానంలో పెద్దలు ,అంతః పురం అన్ని చక్కగా చిత్రించాడు చిత్రకారుడు . బుద్ధుని దంత ఘటనకు సంబంధించి ఇదే మొదటి చిత్రం అంటారు పరిశోధకులు .