Categories
మంచి సిరీస్ చూడాలి అనుకుంటే హాట్ స్టార్ లో గ్రాహణ్ చూడచ్చు.ఇది ఐ.పి.ఎస్ అధికారి అమృత సింగ్ తన ఉద్యోగం లో రాజకీయ నేతల జోక్యం అధికారం కావడంతో ఇబ్బంది పడుతుంది. ఒక దశలో కెనడా లోని తన స్నేహితుడిని పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకుని అక్కడికి వెళ్లిపోవాలనుకుంటుంది. ఉద్యోగం మానేసే క్రమంలో 1984లో జరిగిన అల్లర్ల కేసులో తన తండ్రి ప్రధాన నేరస్తుడని తెలుసుకుంటుంది. దానితో ఉద్యోగ విరమణ వాయిదా వేసుకుని దర్యాప్తు ప్రారంభిస్తుంది ఆమె కేసులో లోతుగా పరిశోధన చేస్తున్న కొద్ది ఎన్నో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. హిందూ అబ్బాయి సిక్కు అమ్మాయి మధ్య ప్రేమ కథ తో పాటు ఎన్నో కొత్త విషయాలు గ్రాహణ్ ఉత్కంఠ తో నడుస్తోంది.నవలా రచయిత సత్య వ్యాస్ 1984 లో బొకారో లో జరిగిన సిక్కు వ్యతిరేకత అల్లర్ల పై రాసిన చౌరాసి అనే పుస్తకం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ గ్రాహణ్ తీశారు.